మార్చి 13న జాబ్ మేళా
800కు పైగా ఉద్యోగ అవకాశాలు
డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ (DEET) ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థ మహీంద్రా & మహీంద్రా ట్రాక్టర్ తయారీ యూనిట్, జహీరాబాద్ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈనెల 13న ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మార్చి 13, 2026 (శుక్రవారం) ఉదయం 9.00 గంటల నుండి సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్‌పేట్, హనుమాన్ నగర్
లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ జాబ్ మేళా ద్వారా 800కు పైగా ఖాళీలను ట్రెయినీ మరియు అప్రెంటిస్ పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారని వెల్లడించారు.
ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.అర్హత కలిగిన యువత తమ విద్యా ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు,బయోడేటా,ఇతర అవసరమైన ధ్రువ పత్రాలతో జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాన్ని పొందాలని ఆయన కోరారు.
Comments
Leave a Reply