బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, మహిళల భద్రత పై పోలీసులు అవగాహన పెంపొందించేందుకు గ్రామాలు, పాఠశాలలు , సమావేశాల ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసు అధికారులు గ్రామాలు, పాఠశాలలు సందర్శిస్తున్నారు.
ర్యాలీల ద్వారా, గ్రామ సభలు , సమావేశాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా పోలీస్ సేవలపై, ఐ వి ఆర్ ఎస్ కాల్స్ ప్రాముఖ్యత, విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ మోసాల నుండి జాగ్రత్తలు, రోడ్డు భద్రత నియమాల గురించి వివరించారు.
అదే విధంగా శక్తి యాప్, డయల్ 112 , చైల్డ్ లైన్ 1098, సైబర్ హెల్ప్ లైన్ 1930 టోల్ ఫ్రీ నంబర్ల వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈవ్ టీజింగ్, డ్రగ్స్ దుష్ప్రభావాలు, బాల్య వివాహాల నిరోధ చట్టం, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, మహిళల పై జరిగే నేరాల పై కూడా విద్యార్థులకు వివరించారు.
Comments
Leave a Reply