తెలంగాణ
ప్రభుత్వ అధికారుల పాత్ర అత్యంత కీలకం
- జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి.,. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్...
- నాగర్ కర్నూలు జిల్లా :..
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరాలంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరం డైరీని కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం లతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ...
టీజీవో డైరీలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఎంతో అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.
అధికారులు, ఉద్యోగులందరూ అహర్నిశలు శక్తి వంచన లేకుండా జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా కృషి చేస్తూ నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరేలా ప్రతి ప్రభుత్వ అధికారి, ఉద్యోగి ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పని చేయాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేసి నాగర్ కర్నూల్ జిల్లాకు పేరు ప్రతిష్ట తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో
జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు పి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి పి. సంజీవ, అసోసియేట్ అధ్యక్షులు, ఎండి ఖాజమైనుద్దీన్, జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రావు ట్రెజరర్ కే రాజు, జాయింట్ సెక్రటరీలు లలిత, అశోక్ మరియు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్, సెంట్రల్ సెక్రెటరీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Leave a Reply