కేశంపేట : కేశంపేట మండలంలోని అల్వాల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే బండలాగుడు పోటీలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కేశంపేట మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ మల్లేష్, కమిటీ ప్రెసిడెంట్ మరియు సభ్యులు, శ్రీనివాస్, మాధపురం మల్లేష్, తిరుమల రెడ్డి వెంకటేష్, చేగురి శ్రీశైలం పాండు, ఆర్ శంకరయ్య, ఏ చంద్రశేఖర్, నరేష్ కుమార్, కుమ్మరి రాజు, మహేందర్ తదితరులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోటీల ప్రారంభోత్సవ సభలో తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినం భక్తి, ఐక్యత మరియు సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని, ఇటువంటి కార్యక్రమాలు గ్రామ సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.
బండలాగుడు పోటీలు కేవలం క్రీడలే కాకుండా, గ్రామ సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించే సంప్రదాయ వేడుకలని ఆమె అభిప్రాయపడ్డారు. యువత మంచి మార్గంలో ముందుకు సాగాలని, గ్రామాభివృద్ధిలో చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, పోటీలను వీక్షించేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. నిర్వహకులను ఆమె అభినందించి, భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
Comments
Leave a Reply